సుంకరమెట్ట-కటికి రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ABN, First Publish Date - 2020-12-12T04:41:24+05:30
సుంకరమెట్ట-కటికి రహదారి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు.
రహదారి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ
అరకులోయ ఎమ్మెల్యే ఫాల్గుణ
అరకులోయ, డిసెంబరు 11: సుంకరమెట్ట-కటికి రహదారి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. శుక్రవారం సుంకరమెట్ట గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రోడ్డు పనులను పరిశీలించారు. గతంలో నిర్మించిన రోడ్లు ఏడాదికే గుంతలు ఏర్పాడ్డాయని, ఆ పరిస్థితి రాకుండా పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయన వెంట వైసీపీ మండల అధ్యక్షుడు గాసి, నాయకులు బురిడి ప్రసాద్, కమిడి అశోక్, ఆనంద్, సన్యాసి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:41:24+05:30 IST