ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమేష్‌బాబు
ABN, First Publish Date - 2020-11-04T04:12:02+05:30
ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.రమేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం నగరానికి వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు.
మహారాణిపేట, నవంబరు 3: ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.రమేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం నగరానికి వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రవికుమార్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు జిల్లా ఖజానా విభాగంలో పనిచేస్తున్న రమేష్‌బాబు పేరును ప్రతిపాదించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు రమేష్‌బాబుకు అభినందనలు తెలిపారు.
Updated Date - 2020-11-04T04:12:02+05:30 IST