ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ భూమిని కాపాడాలని పాలసీగా తీసుకున్నాం’

ABN, First Publish Date - 2020-10-26T18:44:09+05:30

విశాఖలోని గీతం విశ్వ విద్యాలయంపై దాడికి పాల్పడి విధ్వంసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : విశాఖలోని గీతం విశ్వ విద్యాలయంపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనమని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకుని చాలా మంది తెలుగు తమ్ముళ్లు మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విమర్శలపై ఇప్పటికే స్పందించిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మరోసారి మీడియా ముందుకొచ్చారు. గీతం యూనివర్శిటి ఆక్రమించిన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రమే గవర్నమెంట్స్ స్వాధీనం చేసుకున్నదన్న విషయన్ని మరోసారి గుర్తు చేశారు.


బయటపెట్టండి!

ప్రభుత్వ భూమిని కాపాడాలని పాలసీగా మేము తీసుకున్నాం. దీనిని కక్ష సాధింపు చర్యలా బాబు, లోకేష్, టీడీపీ నేతలు మాట్లాడడం దారుణం. కోర్టు ఆర్డర్‌ని కూడా వక్రీకరించి.. ప్రభుత్వం చర్య దుర్మార్గం అన్నట్లు కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఆ భూమి మీద హక్కు ఉన్నట్లు ఎక్కడా వారు పిటీషన్‌లో పేర్కొనలేదు. అప్పనంగా ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చుస్తున్నారు. మీ పిటిషన్‌పై కోర్ట్ ఏమి వ్యాఖ్యానించిందో చెప్పాలి. గీతం అక్రమణలో ఉన్న భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వాడుతాం. మా వారి మీద (వైసీపీ నేతలు) కూడా భూఅక్రమణలు ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.. వెంటనే వాటిని బయట పెట్టాలి. చంద్రబాబు ఒక అవినీతి విశ్వవిద్యాలయం కడుతున్నారు. గీతంకు హక్కు ఉన్న భవనాలను మేము ఎందుకు కొడతాంఅని టీడీపీ నేతలపై అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Updated Date - 2020-10-26T18:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising