ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలి

ABN, First Publish Date - 2020-12-04T05:57:40+05:30

జీవీఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలల హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

మహా ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహా ధర్నాలో జీవీఎంసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుల డిమాండ్‌

సిరిపురం, డిసెంబరు 3: జీవీఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలల హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలను చెల్లించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, అధ్యక్షుడు జి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఎంవీ ప్రసాదరావులు మాట్లాడుతూ హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు ఆపివేసిన కార్మికుల స్థానంలో వారి పిల్లలను పనిలో పెట్టాలన్నారు. మలేరియా, నీటి సరఫరా, యూజీడీ డ్రైవర్లకు హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 11వ పీఆర్‌సీ అమలు, ఇంజనీరింగ్‌, మలేరియా డ్రైవర్లకు హెల్త్‌ అలవెన్స్‌ అమలు కోసం డీఎంఏకి, ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టి.నూకరాజు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising