మన్యంలో చలి పంజా
ABN, First Publish Date - 2020-12-02T05:21:13+05:30
మన్యంలో చలి పంజా విసురుతున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
చింతపల్లిలో కురుస్తున్న మంచు
పాడేరు, అరకు, చింతపల్లిల్లో 11 డిగ్రీలు నమోదు
పాడేరు/చింతపల్లి, డిసెంబరు 1: మన్యంలో చలి పంజా విసురుతున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం పాడేరు, అరకు, చింతపల్లిల్లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత పెరగడంతో పాటు పాడేరు, అరకు, లంబసింగి, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. రానున్న రోజుల్లో ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయి.
Updated Date - 2020-12-02T05:21:13+05:30 IST