ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2020-08-16T14:09:24+05:30

సింహాద్రి అప్పన్న దేవస్థానం పరిదిలో జరిగిన గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం(విశాఖపట్నం): సింహాద్రి అప్పన్న దేవస్థానం పరిదిలో జరిగిన గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, భూముల్లో అనధికార నిర్మాణాలు తదితర అంశాలపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్‌ కమిటీ నివేదక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం తన జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆలయాల ఆదాయం గణనీయంగా తగ్గిందని, అందువల్లే ఉద్యోగుల సంఖ్యను కొంతమేర తగ్గించామని, అయితే ఎవరినీ ఉద్యోగం నుంచి తీసివేయబోమని స్పష్టం చేశారు. పంచగ్రామాల భూవివాదాన్ని ప్రస్తావిస్తూ త్వరలో కోర్టు నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రి కుటుంబ సభ్యులకు ఈవో భ్రమరాంబ స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.


Updated Date - 2020-08-16T14:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising