ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9,740 లీటర్ల సారా ఊట ధ్వంసం

ABN, First Publish Date - 2020-03-16T07:00:23+05:30

జిల్లాలో ఎక్సైజ్‌, పోలీసు సంయుక్తం ఆదివారం వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 9740 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరు రూరల్‌, మార్చి 15 :  జిల్లాలో ఎక్సైజ్‌, పోలీసు సంయుక్తం ఆదివారం వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 9740 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు. పాడేరు ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో 7,500 లీటర్ల ఊట, వంద లీటర్లు సారాను ధ్వంసం చేశామని స్థానిక ఎక్సైజ్‌ సీఐ డి.అనిల్‌కుమార్‌ తెలిపారు. సలుగు పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన దాడుల్లో సారా తయారీకి ఉపయోగించే వెయ్యి లీటర్లు ఊటను, 20 లీటర్ల సారాను ధ్వంసం చేశామన్నారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభలో స్థానిక  ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ సారా తయారీ, అమ్మకాలు వల్ల కలిగే నష్టాలను వివరించారు. సారాతో దొరికితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.


జి.మాడుగుల మండలం కులుపాడులో నిర్వహించిన దాడుల్లో 4,500 లీటర్లు సారా ఊట, 80 లీటర్లు సారాను ధ్వంసం చేశామన్నారు. ఈ దాడుల్లో జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఉపేంద్ర సంపూర్ణ సహకారం అందించారన్నారు. పెదబయలు మండలం బడమ్‌భీరులో ్ల రెండు వేల లీటర్లు ఊట ధ్వంసం చేశామన్నారు. ఈ దాడుల్లో పెదబయలు ఎస్‌ఐ రాజారావు సిబ్బందితో పాటు ఎక్సైజ్‌ ఎస్‌ఐ జి.సీహెచ్‌. వి.రమణారావు, హెచ్‌సీ అప్పా రావు, సిబ్బంది కిరణ్‌కుమార్‌, అప్పలనాయుడు, అశోక్‌కుమార్‌, ఎన్‌.డి.ప్రసాద్‌, పూర్ణచందరరావు, రాము పాల్గొన్నారు.


చినదొడ్డిగల్లులో వెయ్యి లీటర్ల సారా ఊట.. 

చినదొడ్డిగల్లు (నక్కపల్లి), మార్చి 15: మండలంలోని చినదొడ్డిగల్లు గ్రామానికి ఆనుకుని పోలవరం కాలువ సమీపాన సారా తయారీ కేంద్రంపై నక్కపల్లి ఎస్‌ఐ శివరామకృష్ణ సిబ్బందితో  ఆదివారం దాడి చేశారు. పోలీసులు రావడం గమనించిన సారా తయారీదారులు పారిపోయారు.ఈ దాడుల్లో 1000 లీటర్ల సారా ఊట, నల్లబెల్లంతో వున్న డ్రమ్ములను ధ్వంసం చేశామని ఎస్‌ఐ చెప్పారు.  


1240 లీటర్ల సారా ఊట...

 దేవరాపల్లి, మార్చి 15 : మండలంలోని వాలాబు,  రైవాడ జలాశయం ఆవతల ప్రాంతాల్లో దాడులు చేసి 1240 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు.  ఎస్‌.ఐ. పి.నరసింహమూర్తి, అదనపు ఎస్‌.ఐ.జి. అంజిబాబు ఆధ్వర్యంలో  వాలాబు పంచాయతీ బొడ్డగుమ్మి, విప్పగరువు, సామాలమ్మ కళ్లాలు, బేతపూడి కళ్లాలు, రైవాడ జలాశయం ఆవలి ప్రాంతాల్లో దాడులు చేశారు.  దాడుల్లో సిబ్బంది గాంధీ, సాయి, వెంకటరావు, రాములు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T07:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising