నాడు హెచ్‌పీసీఎల్‌లో 60 మంది మృతి
ABN, First Publish Date - 2020-05-09T07:11:35+05:30
నగరంలోని హెచ్‌పీసీఎల్‌లో 1997 సెప్టెంబరు 14న లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లీకై సంభవించిన
మల్కాపురం (విశాఖపట్నం), మే 8: నగరంలోని హెచ్‌పీసీఎల్‌లో 1997 సెప్టెంబరు 14న లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లీకై సంభవించిన విస్ఫోటంలో 60 మంది మృత్యువాతపడ్డారు. సంస్థలోని భారీ స్పియర్స్‌లోకి నౌక నుంచి వచ్చిన గ్యాస్‌ను లోడింగ్ చేశారు. అనంతరం స్పియర్ దిగువనున్న వాల్వు లీక్ కావడంతో సంస్థ మొత్తం గ్యాస్ వ్యాపించింది. అది గుర్తించని ఓ ఉద్యోగి క్యాంటీన్‌లోకి వెళ్లి స్టవ్ వెలిగించడంతో పెద్ద శబ్దంతో విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు.
పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తేవడానికి ఐదు రోజుల సమయం పట్టింది. ఆ తరువాతే గ్యాస్ లోడింగ్‌లో క్రమేపీ మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం విశాఖ రిఫైనరీలోనే భూగర్భంలో భారీ స్పియర్స్ వుంచి వాటిలో గ్యాస్ నిల్వ చేస్తున్నారు. గ్యాస్ ఫిల్లింగ్ కోసం పెట్రోపార్కు వరకు భూగర్భం నుంచే పైప్‌లైన్ వేశారు. గ్యాస్ లోడింగ్‌కు సాగరదుర్గా బీచ్ సమీపంలో సొరంగం తవ్వి ఫిల్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2020-05-09T07:11:35+05:30 IST