ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరవాడ యువకుడికి 510 ర్యాంకు

ABN, First Publish Date - 2020-08-05T10:34:46+05:30

జాతీయ స్థాయిలో నిర్వహించిన సివిల్స్‌ ఫలితాల్లో పరవాడ ప్రాంతానికి చెందిన కోరుపోలు సత్యధర్మప్రతాప్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిటైర్డు టీచరు కుమారుడు కోరుపోలు సత్యధర్మప్రతాప్‌ ఘనత


విశాఖపట్నం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో నిర్వహించిన సివిల్స్‌ ఫలితాల్లో పరవాడ ప్రాంతానికి చెందిన కోరుపోలు సత్యధర్మప్రతాప్‌ 510 ర్యాంకు సాధించాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం విడిచిపెట్టి సివిల్స్‌కు పోటీపడి అనుకున్నది సాధించి తల్లిదండ్రుల కలలు నిజం చేశాడు. వాడచీపురుపల్లి దరి బండారుపాలెం గ్రామానికి చెందిన రిటైర్డు తెలుగు టీచర్‌ కోరుపోలు అమ్మినాయుడు, లక్ష్మి దంపతుల చిన్నకుమారుడైన సత్యధర్మప్రతాప్‌ నాలుగో తరగతి వరకు సొంతూరులో ప్రైవేటు కాన్వెంట్‌లో, ఐదు నుంచి టెన్త్‌ వరకు గుడిలోవ విజ్ఞాన విహార్‌లో, ఇంటర్‌ విజయవాడ గౌతమ్‌ జూనియర్‌ కళాశాలలో చదివాడు. అనిట్స్‌లో ఈసీఈలో చేరి 2010లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి టీసీఎస్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో పనిచేసి 2016లో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. 


ప్రజా సేవ చేయాలనే సివిల్స్‌కు..సత్యధర్మప్రతాప్‌

చిన్నప్పటి నుంచి అమ్మనాన్న , తరువాత అన్నయ్య సౌరీనాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో సివిల్స్‌ రాయాలనే కోరిక ఉండేది. అయితే ఇంజనీరింగ్‌ పూర్తిచేసి నేరుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో టీసీఎస్‌లో చేరిపోయాను. ఉద్యోగంలో చేరిన తరువాత సివిల్స్‌పై మక్కువ కలిగింది. సివిల్స్‌లో ప్రజలకు సేవచేసే అవకాశం దొరుకుతుంది. 

Updated Date - 2020-08-05T10:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising