ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ పరీక్షలకు 427 ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2020-09-19T09:15:15+05:30

గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి జరుగనున్న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణాకు ప్రజా రవాణా శాఖ(పీటీడీ) బ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

60 శాతం సీటింగ్‌కు అనుమతి


ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 18 :  గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి జరుగనున్న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణాకు ప్రజా రవాణా శాఖ(పీటీడీ) బస్సులు సన్నద్ధమయ్యాయి. పీటీడీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం ఇందుకు 427 బస్సులను సిద్ధం చేసింది. సచివాలయం పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలోనే ఎక్కువ బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు.


ఈమేరకు రూట్‌ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు. కొవిడ్‌-19 దృష్ట్యా బస్సుల్లో 60 శాతం సీటింగ్‌కు మించకుండా ప్రయాణికులను అనుమతించాలి నిర్ణయం తీసుకున్నట్టు రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం తెలిపారు. ప్రతి ప్రయాణికుడు మాస్క్‌ను తప్పని సరిగా ధరించాలని ఆర్‌ఎం సూచించారు. 


పరీక్షలకు హాజరయే అభ్యర్థులు రవాణా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత డిపో మేనేజర్ల సంప్రదించాలని సూచించారు. మద్దిలపాలెం 9959225597, వాల్తేరు 9959225590,  కూర్మన్నపాలెం 9959225593, మధురవాడ 8978200455, పాడేరు 9440628092, గాజువాక 9959225590, అనకాపల్లి 9959225595,  ద్వారకాకాంప్లెక్సు 9100109731, నర్సీపట్నం 9959225596, విశాఖపట్నం 9959225594, సింహాచలం 9959225592 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2020-09-19T09:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising