విశాఖ: స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2020-06-01T13:42:12+05:30
విశాఖ: స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరి మృతి
విశాఖపట్నం: నాటుసారాగా భావించి సర్జికల్ స్పిరిట్ తాగిన సంఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. కశింకోటలో స్పిరిట్ తాగి ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా... తాజాగా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ పాంగి దొరబాబు(45), వడ్లమూడి మాణిక్యం(62 )మృతి చెందారు. మృతులు కసింకోటకు చెందినవారుగా గుర్తించారు.
Updated Date - 2020-06-01T13:42:12+05:30 IST