ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగి ఖాతా నుంచి..రూ. 20 వేలు విత్‌డ్రా

ABN, First Publish Date - 2020-05-23T12:54:19+05:30

సచివాలయ ఉద్యోగి ఖాతా నుంచి..రూ. 20 వేలు విత్‌డ్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు


విశాఖ: సచివాలయ ఉద్యోగిని అక్కౌంట్‌ నుంచి రూ.20 వేలును ఓ అజ్ఞాత వ్యక్తి కాజేశాడు. ఈ మేరకు బాధితురాలు ఏఎస్పీ సతీశ్‌కుమార్‌కి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపాలెం సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాధవి ఏటీఎం కార్డు తన భర్త ఇమ్మానుయేలు వద్ద ఉంది. గురువారం ఓ అజ్ఞాత వ్యక్తి ఇమ్మానుయేల్‌కి ఫోన్‌ చేసి.. తాను బ్యాంక్‌ మేనేజర్‌నని, మీ ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిపోతుందని, మీ సెల్‌ నంబర్‌కి ఓటీపీ వస్తుందని.. అది చెబితే మీకు కొత్తకార్డు పంపిస్తామని చెప్పాడు. సైబర్‌ నేరాలపై అవగాహన లేని ఇమ్మానుయేలు వచ్చిన ఓటీపీని అజ్ఞాత వ్యక్తికి చెప్పాడు. దీంతో అతని భార్య మాధవి ఖాత నుంచి రూ.20 వేల డ్రా చేసినట్టు మెసేజ్‌ వచ్చింది. ఈవిషయమై బ్యాంక్‌ మేనేజర్‌కి సంప్రదించగా.. మోసపోయామని గుర్తించి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ఈసందర్భంగా ఏఎస్పీ సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లో ఎదుటువారికి చెప్పరాదన్నారు.

Updated Date - 2020-05-23T12:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising