ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరకాన్ని తలపిస్తున్న విమ్స్ కోవిడ్ ఆస్పత్రి

ABN, First Publish Date - 2020-08-03T21:29:18+05:30

విమ్స్ ఆస్పత్రి నరకాన్ని తలపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విమ్స్ ఆస్పత్రి నరకాన్ని తలపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. కరోనా బాధితులు బెడ్ పైనుంచి కింద పడినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎవరు ఎన్ని చెబుతున్నా, ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ మహిళ బెడ్ పైనుంచి కిందపడిపోయి చాల సేపటి నుంచి కొట్టుకొంటున్నా ఎవరూ పట్టించుకోలేదని అక్కడున్న ఓ వ్యక్తి తెలిపాడు. అన్ని సదుపాయాలు ఉన్నాయని.. కానీ బాధితులను చూడ్డానికి సిబ్బంది లేరని వాపోయాడు. బాత్ రూమ్‌లు చాలా దారుణంగా ఉన్నాయని శుభ్రం చేయడంలేదని తెలిపాడు. 


మరో కరోనా పేషెంట్ మాట్లాడుతూ రాత్రి ఒక వ్యక్తి పరుగున ఆస్పత్రికి వచ్చి అరిచి.. అరిచి కిండపడి చనిపోయాడని, డాక్టర్లు, నర్సులు ఎవరూ లేరని తెలిపాడు. ఇక్కడ పరిస్థితి చూస్తూంటే తాను ఇంటికి వెళతానా? లేదా? అనే భయం కలుగుతోందన్నాడు. పేషెంట్లను ఎవరూ సరిగా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. బెడ్‌లను శానిటైజ్ చేయడంలేదని, దుప్పట్లు లేవని, కరోనా భయం కన్నా ఆస్పత్రి వాతావరణం చూసే చాలామంది చనిపోతున్నారని ఆ పేషెంట్ వాపోయాడు.

Updated Date - 2020-08-03T21:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising