విజయవాడ..కర్రలు, కారంతో దాడి
ABN, First Publish Date - 2020-05-09T17:19:14+05:30
నగరంలోని పాత రాజరజెశ్వరిపేటలో పాత కక్షల నేపధ్యంలో అర్ధరాత్రి ఓ ఇంటిపై స్థానిక నేతలు దాడి చేశారు.
విజయవాడ: నగరంలోని పాత రాజరజెశ్వరిపేటలో పాత కక్షల నేపధ్యంలో అర్ధరాత్రి ఓ ఇంటిపై స్థానిక నేతలు దాడి చేశారు. స్థానికంగా ఉంటున్న వ్యక్తి సుభానీ ఇంటిపై కర్రలు, కారంతో దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన వచ్చిన మహిళలపై కర్రలు, కారంతో విచక్షణారహితంగా దాడిచేశారు. అల్లరిమూక దెబ్బలు తాళలేక బాధితుడు సుభానీ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పాత కక్షలు నేపధ్యంలో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే వైసీపీలో ఖురుషిద్, ఆమె అనుచరులు చేరారు.
Updated Date - 2020-05-09T17:19:14+05:30 IST