ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో వరద బాధితుల అవస్థలు

ABN, First Publish Date - 2020-09-29T16:08:45+05:30

భారీ వర్షాలతో ఇళ్లలో నీరు చేరడతో అధికారులు వరద బాధితులను ఇందిరాగాంధీ స్టేడియంలో ఉంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: భారీ వర్షాలతో ఇళ్లలో నీరు చేరడతో అధికారులు వరద బాధితులను ఇందిరాగాంధీ స్టేడియంలో ఉంచారు. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని  మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద వస్తున్నట్లు ముందుగా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని... అర్ధరాత్రి ఇంట్లోకి నీరు రావడంతో అందిన సామాన్ల వరకు తీసుకుని బయటకు వచ్చామని చెప్పారు. స్టేడియం గ్యాలరీల్లో పెట్టడంతో వర్షం, చలికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అల్పాహారం, భోజనం అసలు బాగోడం లేదని చెప్పారు. అదేమని అడిగితే..  పెట్టిందే ఎక్కువ.. తినండి అంటూ దూషిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్దులు రాలేకపోతే వారికి భోజనం కూడా పెట్టడం లేదని మండిపడ్డారు.  ఉడకని పుల్కాలు, నీళ్ల చారు తినలేక పారేస్తున్నామన్నారు. మరుగుదొడ్లు లేక అనేక మంది వృద్ధులు అవస్థలు పడుతున్నారని.. అయినా ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సాయం అందడం లేదని వాపోయారు. నెల రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఇళ్లను వీడాల్సి వచ్చిందన్నారు. సీఎం జగన్ స్పందించి.. తమకు వరద బాధ లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-09-29T16:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising