ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: మెట్రో‌గోడౌన్‌లో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2020-08-22T12:14:12+05:30

నగరంలోని హనుమాన్ పేట మెట్రో గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని హనుమాన్ పేట మెట్రో గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 12 గంటలుగా మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి 7 గంటలకే గోడౌన్ మూసివేశారు.  గోడౌన్ మూసివేసి ఉన్న నేపథ్యంలో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గోడౌన్‌లో ఫెవికాల్, సొల్యూషన్ ఉండడంతో మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. పాదరక్షకలు తయారీకి వాడే మిశ్రమాల స్టోరేజ్ గోడౌన్‌గా అధికారులు గుర్తించారు. 

Updated Date - 2020-08-22T12:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising