ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలి : కేంద్రమంత్రికి విజ్ఞప్తి

ABN, First Publish Date - 2020-09-22T21:49:31+05:30

విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ)ని ఏర్పాటు చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ)ని ఏర్పాటు చేయాలని మంగళవారం రాజ్యసభలో వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి విద్యా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్‌ ఐటీ చట్టాల సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో పీపీపీ విధానంలో ఏర్పాటైన ట్రిపుల్‌ ఐటీ పని చేస్తోందని అన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి, త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో మరో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రాంతమని తెలిపారు.


కొత్తగా ఏర్పాటైన విద్యా సంస్థలను జాతీయ ప్రాధాన్యత హోదా కల్పించడంతోపాటు ఇప్పటికే ఏర్పాటైన అలాంటి సంస్థలకు అన్ని రకాల మౌలిక వసతులను త్వరితగతిన కల్పించే విషయంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు. ఉదాహరణకు 2015లో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఐఐఎం ఇప్పటికీ ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్‌ నుంచే పని చేస్తున్నదని ఆయన గుర్తు చేశారు. ఐఐఎంకు శాశ్వత భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయల కల్పనను త్వరతిగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే అనంతపురంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ యూనివర్శిటీకి సైతం ఇప్పటి వరకు శాశ్వత భవనాల నిర్మాణం జరగనందున అనేక ఇబ్బందులతో తాత్కాలిక క్యాంపస్‌లోనే నెట్టుకొస్తున్నదని తెలిపారు.


ట్రిపుల్‌ ఐఐటీల ద్వార సాంకేతికంగా ప్రతిభ కలిగిన మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందన్నది ఈ బిల్లు ఉద్దేశం. అయితే అత్యంత ఈ సంస్థల ద్వారా అందుబాటులోకి వచ్చే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళిపోకుండా దేశంలోనే వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వద్ద ఏవైనా ప్రణాళిక ఉందా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. అలాగే దేశంలో అత్యధికమంది విద్యార్ధులు ఐఐటీలో ప్రవేశం కోరుకుంటారు.


ఆయా సంస్థల్లో జరిగే నాణ్యమైన విద్యా బోధన, పరిశోధన, ఫాకల్టీ, మౌలిక వసతులు అందుకు దోహదం చేస్తున్నాయి. ట్రిపుల్‌ ఐటీలలో కూడా అదే రకమైన ప్రమాణాలతో విద్యా బోధన, పరిశోధన, అత్యుత్తమ ఫాకల్టీ, వసతుల కల్పన ద్వారా ఐఐటీ స్థాయికి చేరుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-09-22T21:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising