ఇంట్లోనే చవితి: వెంకయ్య
ABN, First Publish Date - 2020-08-22T09:08:58+05:30
వినాయక చవితి వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమభావనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి ద్వారా సంఘ సంస్కర్త బాలగంగాధర్ తిలక్ జాతీయ భావనను వ్యాప్తి చేశారని తెలిపారు. మట్టితో విగ్రహాలతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్లలోనే పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని సూచించారు.
Updated Date - 2020-08-22T09:08:58+05:30 IST