ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటల్లో వాళ్లను పట్టుకోండి.. లేదంటే.. : వర్ల

ABN, First Publish Date - 2020-10-04T19:41:21+05:30

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు అద్దాలను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పగులగొట్టిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు అద్దాలను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పగులగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. కొద్దిసేపటి క్రితం విజయవాడకు వచ్చిన ఆయన పట్టాభిని పరామర్శించారు. పట్టాభి కారును ఆయన పరిశీలించారు. పట్టాభి సంస్కారి అని.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తున్నారనే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. 24 గంటల్లో పట్టాభి కారుపై దాడి చేసిన వారిని పోలీసులు పట్టుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వర్ల ఒకింత హెచ్చరించారు.


మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలపై మాట్లాడిన ఆయన.. ఒక వెకిలి వ్యక్తికి జగన్ ఒక డిప్యూటీ సీఎం ఎలా ఇచ్చారు..? అని ప్రశ్నించారు. చంద్రబాబును ఉద్దేశించి ధర్మాన చేసిన వ్యాఖ్యలను ఆయన సతీమణే అంగీకరించదన్నారు. ధర్మాన ఒక వెకిలివాడు.. ఇంగిత జ్ఞానం లేని వాడని వర్ల వ్యాఖ్యానించారు. ధర్మానలాగా తాము కూడా మాట్లాడగలం కానీ టీడీపీ మాకు సభ్యత నేర్పిందన్నారు. జగన్ సర్కార్‌కు  నూకలు చెల్లె కాలం దగ్గర పడిందని వర్ల జోస్యం చెప్పారు.

Updated Date - 2020-10-04T19:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising