ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు దళితులంటే అసహ్యం: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-09-28T23:13:25+05:30

సీఎం జగన్ దళితులను ఈసడించుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ‘విజయవాడలో దళితులపై దాడులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ దళితులను ఈసడించుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ‘విజయవాడలో దళితులపై దాడులకు సంబంధించి సమావేశం జరిగిన మర్నాడే చిత్తూరులో మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడిపై హత్యాయత్నం జరిగింది. ఈ విధమైన సమావేశాలు మమ్మల్ని ఏమీచేయలేవనే సంకేతం జగన్ ప్రభుత్వం ఇస్తోందా? స్థానిక మంత్రికి జీ...హూజూర్ అనడం తప్ప.. చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేయడం లేదు. టీడీపీ వారికి మాజీ జడ్జి సోదరుడు రామచంద్రపై దాడి చేయాల్సిన అవసరమేంటో జిలా ఎస్పీ చెప్పాలి. స్థానిక ఎస్సై, సీఐ చెప్పింది విని ఎస్పీ స్థాయి అధికారి ఆధారాలు లేకుండా ఏదిపడితే అది మాట్లాడితే ఎలా? జగన్‌కు దళితులంటే అసహ్యం కాబట్టే.. డిప్యూటీ సీఎంకి కూడా కుర్చీ ఇవ్వకుండా తిరుమలలో నిలుచోబెట్టారు. ప్రోటోకాల్ పాటించనప్పుడు దళితులకు ఏ పదవులిస్తే మాత్రం ఏం ఉపయోగం? తన పార్టీకి చెందిన దళిత ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. రామకృష్ణ సోదరుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో మంత్రి పెద్దిరెడ్డిని బైండోవర్ చేసి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించాలి. దళితులకు ఏ ప్రభుత్వం మేలు చేసిందో..  ఎవరి పాలనలో వారు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉన్నారో చర్చించడానికి తాము సిద్ధం. వైసీపీ నుంచి ఎవరొస్తారో రావాలి’ అని వర్ల రామయ్య సవాల్ విసిరారు.

Updated Date - 2020-09-28T23:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising