సీఎం జగన్‌పై వంగలపూడి అనిత ఫైర్..
ABN, First Publish Date - 2020-11-15T16:53:00+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ఇవాళ ఉదయం మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. దీపావళి పండగ నాడూ ఠారెత్తిస్తున్న ధరలతో ప్రజలకు గంజన్నమే దిక్కు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా జగన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని అనిత ఆరోపించారు.
సామాన్యులపైనే లేదేం!
‘ నిత్యావసరాల ధరలపై జగన్ సర్కారు దొంగ నిద్ర పోతున్నట్లుగా వ్యవహరిస్తోంది. నిత్యావసరాల ధరలు తారాజువ్వల కన్నా ఎత్తుకు చేరాయి. ఉప్పూ, పప్పుల ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. తెలుగుదేశం హయాంలో అందించిన పండగ కానుకలు రద్దు చేశారు. ఆకలి అనే మాట లేకుండా చేసిన అన్న క్యాంటీన్లను మూసేశారు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో ధరల విషయంలో దొంగ నిద్ర నటిస్తున్నారు. రాష్ట్ర ఖజానా నింపుకోవడం కోసం సామాన్యులపై భారాలు పెంచుతున్నారు. దీపావళికి ఇంటి చుట్టూ విద్యుత్ దీపాలు పెట్టలేకుండా విద్యుత్ బిల్లు భయం. నూనెల ధరలతో దీపం అనే ఆలోచన దూరమైంది. పిండి వంటలు చేసుకుందామంటే నిత్యావసరాలు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇందుకు ఫలితం గంజన్నం తప్ప మరో దిక్కు లేకుండా చేశారు. స్వామీజీలకు పూజ చేయడంపై జగన్ సర్కార్‌కు ఉన్న శ్రద్ధ సామాన్యుల ఆకలి కేకలపై లేదు’ అని అనిత ఆరోపించారు.
Updated Date - 2020-11-15T16:53:00+05:30 IST