ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగన్ వర్సెస్ జస్టిస్’‌పై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-10-17T17:20:01+05:30

వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: న్యాయమూర్తులపై ఏపీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణల విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విదేశాల్లోలోగా మన దేశంలోనూ వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సీజేకు మెయిల్ చేశానని తెలిపారు. ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధమున్న కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని అన్నారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్ చేయాలన్నారు. లైవ్ టెలీకాస్ట్ పద్ధతి విదేశాల్లో ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేశారన్నారు. కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చని అన్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత కోర్టుల తీర్పుకు లోబడి ఎన్టీయార్ ప్రజాసేవ చేశారన్నారు. 

Updated Date - 2020-10-17T17:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising