ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియాను నియంత్రిస్తే పతనం ప్రారంభమైనట్టే: ఉండవల్లి

ABN, First Publish Date - 2020-02-19T20:58:24+05:30

రాజమండ్రి: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చానల్స్ ప్రసారాలను నిలిపివేశారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చానల్స్ ప్రసారాలను నిలిపివేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాక్షి పేపరు, చానల్ లేదని, మీడియా మొత్తం రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకమని.. అయినా ఆయన ఏనాడు మీడియా జోలికి పోలేదని అన్నారు. మీడియాను ఆపేయాలనే ప్రయత్నం చేయలేదన్నారు. ఆయన డైరెక్టుగానే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారని, ఆ రెండు పేపర్లు అంతేనని చెప్పేవారే తప్ప.. వాటిని ఆపాలనే ప్రయత్నం చేయలేదన్నారు. 


ఇప్పుడు రాజమండ్రిలో రెండు చానల్స్ రావడంలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనకు తెలిసిన విషయం ఏమిటంటే జగన్ ప్రభుత్వమే ఆ రెండు చానల్స్‌ను ఆపమందని తెలిసిందన్నారు. ఇంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా ఇలాగే చేశారని అన్నారు. జగన్‌కు తెలియదేమో చానల్స్ నిలిపివేయడం చాలా తప్పని అన్నారు. వెంటనే రెండు చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలను చూసి భయపడిన మరుక్షణం పతనం ప్రారంభమైనట్టేనని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-02-19T20:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising