తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
ABN, First Publish Date - 2020-09-14T15:59:39+05:30
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తాని అనుకుని కొనసాగుతుంది.
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తాని అనుకుని కొనసాగుతుంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్ల వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీలోని తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణా గుంటూరు....తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌తో పాటు మధ్య తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని... మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Updated Date - 2020-09-14T15:59:39+05:30 IST