ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 నుంచి శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతి: ఏవీ సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2020-06-06T00:10:21+05:30

ఈనెల 11 నుంచి శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. 8, 9 తేదీల్లో ఉద్యోగులకు, 10వ తేదీన స్థానికులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఈనెల 11 నుంచి శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. 8, 9 తేదీల్లో ఉద్యోగులకు, 10వ తేదీన స్థానికులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7.30వరకు దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకుని భక్తులు రావాలని పేర్కొన్నారు. తిరుపతి అలిపిరి దగ్గర కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు అని తెలిపారు. అలిపిరి దగ్గర ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తామని చెప్పారు. 10 లోపు చిన్నారులకు, 65 ఏళ్లు పైబడినవారికి దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఇంకొన్ని రోజులు అనుమతించమని, పుష్కరిణిలోకి భక్తులను అనుమతించమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Updated Date - 2020-06-06T00:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising