ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ ఈవో బదిలీ

ABN, First Publish Date - 2020-10-01T07:25:20+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేశారు. ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏకే సింఘాల్‌ 
  • కొత్త ఈవోగా జవహర్‌రెడ్డికి అవకాశం!

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేశారు. ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయుతే ఇది తాత్కాలికమే. నూతన ఈవోగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని నియమించే అవకాశాలున్నట్లు తెలిసింది. జవహర్‌రెడ్డి గత కొంతకాలంగా తనను టీటీడీ ఈవోగా నియమించాలని అడుగుతున్నట్లు తెలిసింది. పైగా సింఘాల్‌ను వైద్య శాఖకు పంపడంతో అదే శాఖ చూస్తున్న జవహర్‌రెడ్డిని టీటీడీకి బదిలీ చేయొచ్చని అంటున్నారు. 


వెంకయ్య కోలుకోవాలి: గవర్నర్‌

‘ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసి బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని జగన్నాధుడిని, వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాను’ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-10-01T07:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising