ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

ABN, First Publish Date - 2020-05-28T22:04:17+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగింసింది.ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి కీలయ నిర్ణయాలు తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ భూములు విక్రయించొద్దని నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ ఆస్తులు, కానుకలు విక్రయించకూడదని నిర్ణయించింది. నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతమవకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో పాలకమండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులకు చోటు కల్పించనుంది. 


టీటీడీ ఆస్తులు విక్రయిస్తున్నారన్న ప్రచారంపై విచారణ జరపాలని  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పాలకమండలిపై మరోసారి ఆరోపణలు రాకుండా చూడాలన్నారు. 


తిరుమలలో అతిథి గృహాల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని చెప్పారు. పాత అతిధి గృహాలు పునర్నిర్మించేందుకు మాత్రమే అనుమతి ఉందన్నారు. డోనేషన్ విధానంలో నూతన విధానాన్ని రూపొందించాలని ఆదేశించామని ఆయన తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల ఆస్పత్రి ప్రారంభిస్తామని తెలిపారు. తిరుమలలో పాత కాటేజీల కేటాయింపుపై అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు తొలగించాక భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. 

Updated Date - 2020-05-28T22:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising