ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సడలిన సరిహద్దు

ABN, First Publish Date - 2020-08-02T08:53:55+05:30

దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్ధరాత్రినుంచే కొత్త రూల్స్‌ అమల్లోకి..



అమరావతి, జగ్గయ్యపేట ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించింది. రాష్ట్రంలోకి వచ్చేవారికి క్వారంటైన్‌ను తప్పనిసరి చేసిన సరిహద్దు నిబంధనలను సరళతరం చేసింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్‌ రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలగించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్ధరాత్రి నుంచే సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రావాలంటే ఇకపై ఎలాంటి ఆటంకాలు ఉండబోవని అందులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న విధంగానే ‘స్పందన’లో అప్లై చేసుకోవాల్సిందేనని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. రాష్ట్రంలోకి వచ్చేవారి సంఖ్యను నమోదు చేయడం కోసమే ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. కొవిడ్‌ అనుమానం ఉన్నవారికి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తారని తెలిపారు. 


సరిహద్దు కిటకిట..

తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు గరికపాడు వద్ద శనివారం ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అన్‌లాక్‌ -3.0 నిబంధనల సడలింపు, వీకెండ్‌, రక్షా బంధన్‌ పండగ నేపథ్యంలో ఆంధ్రలోకి వచ్చేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన వాహనాలతో ఈ ప్రాంతం కిటకిటలాడిపోయింది. అనేకమంది ఈపాస్‌లు లేకుండానూ వచ్చారు. వారందరినీ గుర్తించేందుకు అధికారులు తనిఖీలు చేపట్టడంతో కొన్ని గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి.


Updated Date - 2020-08-02T08:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising