రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. రేషనలైజేషన్
ABN, First Publish Date - 2020-11-03T09:00:35+05:30
ఉపాధ్యాయ బదిలీలు, రేషన్‌లైజేషన్‌కు సవరించిన షెడ్యూల్ విడుదలైంది. బుధవారం (4వ తేదీ) నుంచి డిసెంబరు 14 వరకు మొత్తం 41 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలు, రేషన్‌లైజేషన్‌కు సవరించిన షెడ్యూల్ విడుదలైంది. బుధవారం (4వ తేదీ) నుంచి డిసెంబరు 14 వరకు మొత్తం 41 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈమేరకు పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం ప్రొసీడింగ్స్ జారీచేశారు. దీని ప్రకారం బుధవారం నుంచి 9వ తేదీ వరకు రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుంది. 10,11 తేదీల్లో ఉపాధ్యాయ ఖాళీల జాబితా ప్రకటిస్తారు. 12 నుంచి 16 వరకు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి. 17, 18 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. 19 నుంచి 23 వరకు ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. అభ్యంతరాలుంటే 24వ తేదీ నుంచి 26 వరకు అందజేయాలి. జాయింట్ కలెక్టర్ ఆ అభ్యంతరాలను పరిష్కరిస్తారు. అనంతరం 30వ తేదీ నుంచి తుది సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. డిసెంబరు 3-5 మధ్య వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. డిసెంబరు 6 నుంచి 11 వరకు బదిలీ ఆదేశాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వీటిలో సాంకేతిక సమస్యలుంటే డిసెంబరు 12,13 తేదీల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. డిసెంబరు 14న సదరు ఆదేశాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Updated Date - 2020-11-03T09:00:35+05:30 IST