ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాంగ్‌ స్టాండింగ్‌ ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత: సురేష్‌

ABN, First Publish Date - 2020-12-11T23:46:37+05:30

లాంగ్‌ స్టాండింగ్‌ ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. హెడ్‌ మాస్టర్లకు 5 ఏళ్లు, టీచర్లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: లాంగ్‌ స్టాండింగ్‌ ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. హెడ్‌ మాస్టర్లకు 5 ఏళ్లు, టీచర్లకు 8 ఏళ్లు ఉంటే బదిలీ చేస్తామని తెలిపారు. 2 ఏళ్లు పూర్తైనవారికి రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం ఇస్తామని సురేష్‌ పేర్కొన్నారు. మరింత పారదర్శకత కోసమే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఆర్‌ఏ ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించామని, 5 రోజుల పాటు వెబ్‌ ఆప్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. బ్లాక్ చేస్తే తప్ప మారుమూల ప్రాంతాలకు ఎవరూ వెళ్లరని, డిసెంబర్‌ 16 నుంచి 6 రోజులు లిస్ట్‌ డిస్‌ప్లే చేస్తామని సురేష్‌ తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. 40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన పోస్టులను రద్దు చేస్తున్నారు.

Updated Date - 2020-12-11T23:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising