పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం
ABN, First Publish Date - 2020-08-16T18:48:06+05:30
టి.నర్సాపుర్ మండలం, అప్పలరాజు గూడెంలో విషాదం నెలకొంది.
ప.గో.జిల్లా: టి.నర్సాపుర్ మండలం, అప్పలరాజు గూడెంలో విషాదం నెలకొంది. ఎర్రకాలువ దాటుతుండగా ద్విచక్రవాహనంతో సహ వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే మృతదేహం, వాహనం లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జీడిమిల్లి మండలం, అంకంపాలెంకు చెందిన ములకల దుర్గారావుగా గుర్తించారు.
Updated Date - 2020-08-16T18:48:06+05:30 IST