అనంతపురం జిల్లా విడపనకల్లులో విషాదం
ABN, First Publish Date - 2020-07-24T17:05:17+05:30
అనంతపురం జిల్లాలో సకాలంలో అంబులెన్స్‌లు రాక గర్భిణిలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
అనంతపురం: జిల్లాలో సకాలంలో అంబులెన్స్‌లు రాక గర్భిణిలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఒక గర్భిణి ఆడశిశువుకు జన్మనిచ్చాక మృతి చెందితే.. మరో గర్భిణికి బస్ షెల్టర్‌లో కాన్పు జరిగింది. 108 అంబులెన్స్‌లకు ఫోన్ చేసినా సకాలంలో స్పందించకపోవడంతో విడపనకల్లులో విషాదం నెలకొంది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి దుర్గా ప్రియకు వైద్యులు కాన్పు చేశారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి.. కానీ గంటన్నర అయినా అంబులెన్స్ రాకపోవడంతో ఆమె పరిస్థితి మరింతగా విషమించింది. తీవ్ర జాప్యం జరిగిన తర్వాత ఆమెను అనంతపురం తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విడపనకల్లు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకుదిగారు. 108 సరైన సమయానికి వచ్చి ఉంటే మహిళ బతికేదని అన్నారు.
Updated Date - 2020-07-24T17:05:17+05:30 IST