ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి శంకుస్థాపన జరిగి సరిగ్గా ఐదేళ్లు

ABN, First Publish Date - 2020-10-22T00:36:30+05:30

అమరావతి శంకుస్థాపన జరిగి మంగళవారానికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఐదేళ్ల క్రితం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి శంకుస్థాపన జరిగి గురువారానికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఐదేళ్ల క్రితం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకు గుర్తుగా గురువారం రాజధాని రైతులు, మహిళలు నిరసన తెలుపనున్నారు. అమరావతి నాటి వైభవం- నేటి దుస్థితి పేరుతో శంకుస్థాపన ప్రాంతంలో నిరసన చేస్తున్నట్లు రాజధాని రైతులు ప్రకటించారు. గురువారం  ఉదయం 9 గంటలకు రాయపూడి, మందడం నుంచి రైతుల పాదయాత్ర చేస్తారు. ఉదయం 10.30కు ఉద్ధండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు చేయనున్నారు. అమరావతి చూపు-మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేయాలని రైతులు నిర్ణయించారు. గురువారం రాత్రి దీక్షా శిబిరాల దగ్గర రైతుల కాగడాల ప్రదర్శన చేస్తారు. 


ఏపీ రాజధానిగా అమరావతికి 2015 అక్టోబర్ 22న (విజయదశమి) మోదీ శంకుస్థాపన చేశారు. ఏపీ పరిపాలన భవన సముదాయానికి 2016 అక్టోబర్ 28న అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి అక్కడి నుంచి పరిపాలన చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన వికేంద్రీకరణ కొరకు 2020 జులై 31న అమరావతిని కేవలం శాసనసభ రాజధానిగా పరిమితం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తున్నారు. రాజధాని ఉద్యమం గురువారానికి 310వ రోజుకు చేరుకోవడం గమనార్హం.

Updated Date - 2020-10-22T00:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising