ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు..రేపు వర్షాలు

ABN, First Publish Date - 2020-11-13T09:26:56+05:30

శ్రీలంక తీరం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): శ్రీలంక తీరం నుంచి  పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఏపీలో ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, సమీప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల, దక్షిణకోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, రాత్రి వేళ చలి గాలులు వీస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఈ నెల 15 నుంచి బంగాళాఖాతం మీదుగా మరో దశ తూర్పుగాలులు వీస్తాయని, కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - 2020-11-13T09:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising