తిరుపతిలో రోడ్డు ప్రమాదం...వృద్ధురాలు మృతి
ABN, First Publish Date - 2020-08-22T16:11:48+05:30
నగరంలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై తొండవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
తిరుపతి: నగరంలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై తొండవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే చంద్రగిరి పోలీసులు అక్కడకు చేరుకుని ఆటోలో ఇరుక్క పోయిన డ్రైవర్‌ను కాపాడి... ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-08-22T16:11:48+05:30 IST