ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబరు 19 నుంచి 27 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2020-08-09T01:36:19+05:30

అధికమాసం నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారికి రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 19 నుంచి 27 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: అధికమాసం నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారికి రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 19 నుంచి 27 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ అధికారులు ప్రకటించారు. సెప్టెంబరు 18న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. సెప్టెంబర్ 23న గరుడ సేవ,2 4 స్వర్ణ రథం, 26న రథోత్సవం, 27 చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అక్టోబర్ 16 నుంచి 24వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అక్టోబరు 20వ తేదిన గరుడ సేవ, 21న పుష్ప పల్లకి, 23న స్వర్ణ రథం, 24న చక్రస్నానంతో   ఉత్సవాలు ముగియనున్నాయి. కరోనా కారణంగా ఏకాంతంగా నిర్వహించేందుకే  టీటీడీ మొగ్గు చూపుతోంది. ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే ఆగమసలహాదారులను టీటీడీ సంప్రదించింది. నెలాఖరున పాలకమండలి సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. 

Updated Date - 2020-08-09T01:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising