ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ లేఖను ఖండించిన ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌కు బెదిరింపులు

ABN, First Publish Date - 2020-10-18T00:54:05+05:30

సీఎం జగన్‌ లేఖను ఖండించిన ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌కు బెదిరింపులు వచ్చాయి. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్ ద యునైటెడ్ కింగ్‌డమ్‌ సభ్యుల పేరుతో బూతులు అందుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సీఎం జగన్‌ లేఖను ఖండించిన ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌కు బెదిరింపులు వచ్చాయి. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్ ద యునైటెడ్ కింగ్‌డమ్‌ సభ్యుల పేరుతో బూతులు అందుకున్నారు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌ కార్యదర్శి, ప్రెసిడెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, పోలీసులకు అధ్యక్ష, కార్యదర్శులు ఫిర్యాదు చేశారు.


సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు పలువురు హైకోర్టు జడ్జిలపై జగన్‌ ఫిర్యాదు చేసి... ఆ పత్రాలను బహిర్గతం చేయడం అనుచిత, అనైతిక, నిజాయితీలేని చర్యగా ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. జస్టిస్‌ రమణపై ఆరోపణలను సుప్రీంకోర్టు అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీఏఓఆర్‌ఏ) కూడా ఖండించింది. వీటిపై ఆయా సంఘాలు వేర్వేరుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ తెలిపింది. కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖను బహిర్గతం చేయడం పూర్తిగా అవాంఛనీయమని ఏకగ్రీవంగా తీర్మానించింది.

Updated Date - 2020-10-18T00:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising