ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మభ్యపెట్టాలని చూస్తున్నారు

ABN, First Publish Date - 2020-08-15T09:51:01+05:30

‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని.. రెండు నెలల క్రితం కౌలు జమ చేస్తున్నామంటూ జీవో విడుదల చేసి నేటికీ కౌలు ఇవ్వలేదు... అలాంటిది సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని అభివృద్ధి చేస్తారా’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని.. రెండు నెలల క్రితం కౌలు జమ చేస్తున్నామంటూ జీవో విడుదల చేసి నేటికీ కౌలు ఇవ్వలేదు... అలాంటిది సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని అభివృద్ధి చేస్తారా’ అంటూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు మండిపడ్డారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వారు చేస్తున్న ఆందోళనలు శుక్రవారానికి 241వ రోజుకు చేరాయి. రాజధానిపై రాష్ట్ర హైకోరు ఈ నెల 27 వరకు  స్టేస్‌కోను పొడిగించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. న్యాయదేవతలే రక్షంటూ తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం దీక్ష శిబిరాల్లో న్యాయదేవత ప్రతిమకు మహిళా రైతులు పాలాభిషేకం నిర్వహించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని   మహిళలు శిబిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నేతృత్వంలో ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఆ పార్టీనేతలు, రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని రైతులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి 80% భూములను అమ్ముకొని రూ.కోట్లు గడించారని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ మండిపడ్డారు.

Updated Date - 2020-08-15T09:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising