ఏటీఎంలలో చోరీకి దొంగల విఫలయత్నం
ABN, First Publish Date - 2020-10-01T21:07:55+05:30
అర్ధరాత్రి ఏటీఎంలలో చోరీకి ప్రయత్నించారు. నాలుగు ఏటీఎంలలో చోరీలకు విఫలయత్నం చేశారు.
కర్నూలు: అర్ధరాత్రి ఏటీఎంలలో చోరీకి ప్రయత్నించారు. నాలుగు ఏటీఎంలలో చోరీలకు విఫలయత్నం చేశారు. ఇద్దరు దుండగులు నంద్యాల చెక్‌పోస్టు వద్దనున్న కెనరా బ్యాంక్ ఏటీఎం, పాత ఆర్డీవో కార్యాలయం వద్ద ఏటీఎం, మాధవీనగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం, గాయత్రి ఎస్టేట్‌లో ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలలో చోరీకి ప్రయత్నించారు. అయితే ఏటీఎంలు ఓపెన్ కాకపోవడంతో దొంగల ప్రయత్నం ఫలించలేదు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-10-01T21:07:55+05:30 IST