ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుకను దోచేస్తున్నారు

ABN, First Publish Date - 2020-02-18T09:24:02+05:30

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుకను దోచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. కఠినమైన చట్టాలు చేశామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ సీఎంకు కనిపించడంలేదా?

కఠిన చట్టాలు చేశామన్నారు

మరి మీ వాళ్లపై చర్యలేవీ?

ప్రజల్ని మభ్యపెట్టడానికే మూడు రాజధానుల డ్రామా

జగన్‌ కుటుంబం, కంపెనీలు తప్ప రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు

ఒక్క చాన్సిస్తే స్వర్గం తెస్తానన్నారు

ఇప్పుడు నరకం చూపుతున్నారు

6 నెలల్లో రాష్ట్రాన్ని నాశనం చేశారు

నిరసనగా రేపు కడపలో ధర్నా

బీజేపీ అధ్యక్షుడు కన్నా ప్రకటన

అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుకను దోచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. కఠినమైన చట్టాలు చేశామని చెబుతున్న సీఎం జగన్‌కు ఇదెందుకు కనిపించడంలేదని నిలదీశారు. హిందూ ఆలయాలను ధ్వంసం చేయించడం, ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు నమోదు చేయడం లాంటి అరాచకాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఒక్క చాన్సిస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తానని.. ప్రస్తుతం రాక్షస పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వ తీరును ఎండగడుతూ మిగతా  బుధవారం (19న) కడపలో ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ చెప్పే మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదన్నారు.


అధికారంలోకి రాగానే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి ఆరు నెలలపాటు భవన నిర్మాణ కార్మికులను ఆకలితో అలమటించేలా చేశారని మండిపడ్డారు. ‘దేశంలో లేని అద్భుత విధానం తీసుకొచ్చామని, ఇసుకను అక్రమంగా తరలిస్తే జైలుకు పంపుతామంటూ చట్టాలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. పాలక పక్ష ఎమ్మెల్యేలు యథేచ్ఛగా నదులు, వాగులు, వంకల్లోని ఇసుకను దోచుకెళ్తోంటే ఏం చేస్తోంది? వైసీపీ ఎమ్మెల్యేల ఇసుక దోపిడీని ప్రశ్నించిన మా పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదెక్కడి న్యాయమని కడప ఎస్పీని, డీజీపీనే కలిసి అడిగినా న్యాయం జరగలేదు’ అని ఆక్షేపించారు.


ఆలయాల ధ్వంసం ప్రభుత్వ పనే...

రాష్ట్రంలో ఆలయాలు, విగ్రహాల ధ్వంసం వైసీపీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరుగుతోందని కన్నా ఆరోపించారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ‘మతిస్థిమితం లేని వారి పని’ అంటూ అన్ని స్టేషన్లలోనూ ఒక్కటే సమాధానం చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఎక్కడో ఒక చోట అలా జరిగి ఉండొచ్చు. అన్ని చోట్లా ఎలా జరుగుతుంది? అది కూడా హిందూ ఆలయాలు, విగ్రహాలు, రథాలపైనే జరుగుతాయా? ఇదంతా ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతోంది. మత మార్పిడులకు అడ్డుకట్ట పడకుంటే బీజేపీ అడ్డుకుని తీరుతుంది’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్‌, ఆయన కుటుంబం, కంపెనీలు తప్ప ఇంకెవరూ సంతోషంగా లేరని, కేవలం ఆరు నెలల్లో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. 


అవినీతి కోసమే అమరావతి తరలింపు..

అహంకారం, నియంతృత్వంతో జీవించే జగన్‌.. అవినీతి కోసమే అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని కన్నా విమర్శించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే మూడు రాజధానుల డ్రామాకు జగన్‌ తెరతీశారని, సీఎం మారగానే రాజధానిని చంకలో పెట్టుకెళ్తామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ‘2015లో అసెంబ్లీలోనే రాజధాని నిర్ణయం జరిగిపోయింది. ఆ రోజు సంపూర్ణ మద్దతిచ్చిన వైసీపీ అధికారంలోకి రాగానే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ప్రజలకు అర్థమవుతోంది. ప్రతిపక్షంలో ఉండగా రూ.3 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పుస్తకాలు ముద్రించిన జగన్‌ ఎనిమిది నెలలుగా ఏం చేస్తున్నారు? అవినీతి నిజంగా జరిగి ఉంటే.. బాధ్యులను జైలుకు పంపే దమ్ములేక ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు.


అమరావతితో పాటు విశాఖపట్నం భూముల వ్యవహారంపైనా చర్యలు తీసుకోవాలని పదే పదే బీజేపీ తరపున తాము లేఖలు రాస్తున్నా ముఖ్యమంత్రి ఏమీ చేయలేక పోతున్నారు. ఇంట్లో ఎలుకలు పడితే వాటిని పట్టాలి తప్ప ఇంటిని తగలెడతారా’ అని నిలదీశారు. టీడీపీ, వైసీపీలకు బీజేపీ సమదూరంలో ఉంటుందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లకు ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించిందని, వారి వెంట వైసీపీ కార్యకర్తలు ఇళ్లకు వస్తూ అర్హులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నా ఆరోపించారు. ఇదే విషయాన్ని తమ పార్టీ వాళ్లు అడిగితే హత్యాయత్నం కేసు నమోదు చేశారని, ఉపముఖ్యమంత్రి దగ్గరుండి మరీ కేసు నమోదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్గాన్ని తెస్తానంటూ.. ప్రజలకు నరకం చూపిస్తున్నారని.. రాక్షస రాజ్యాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. 


దరఖాస్తుల బాధ్యత పురందేశ్వరి కమిటీకి

స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ, జనసేనతో పొత్తు తదితర అంశాలపై బీజేపీ రాష్ట్ర నేతలు సోమవారం విజయవాడలో సుదీర్ఘంగా చర్చించారు. పంచాయతీ వార్డు నుంచి నగర మేయర్‌ వరకూ పోటీ చేయాలనుకుంటున్న ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరించే బాధ్యతను కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ రాష్ట్రంలోని ఐదు(విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడప) ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిపై అంచనా వేస్తుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడ బలంగా ఉన్నాం.. ఎక్కడ పోటీ చేయాలి.. జనసేనతో ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి.. తదితర అంశాలపై మిత్రపక్షంతో చర్చించాలని ఈ భేటీలో నిర్ణయించారు.

Updated Date - 2020-02-18T09:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising