ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విజృంభణ

ABN, First Publish Date - 2020-05-29T07:37:35+05:30

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 128మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అరుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 128 రాష్ట్రంలో తాజా కేసుల సంఖ్య ఇది
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 74 మంది 
  • 3,245కు చేరిన పాజిటివ్‌లు 
  • వంద మార్కు దాటిన విశాఖ 
  • కర్నూలులో మరో కొవిడ్‌ మరణం


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 128మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అరుంది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 74మంది ఉన్నారు. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 3,245కు పెరిగాయి. ఇందులో రాష్ట్రంలోని వారు 2,841మంది కాగా, విదేశాల నుంచి వచ్చినవారు 111మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 293మంది ఉన్నారని ఆరోగ్యశాఖ నిర్ధారించింది. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌(ఆరోగ్యసేతు)లో బుధవారం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,171 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో మరొకరు కరోనాతో మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌-19 మరణాలు 59కి చేరాయి. కర్నూలు జిల్లాలో మరో 15మందికి, గుంటూరు జిల్లాలో 13మందికి కరోనా సోకింది.


కడప జిల్లాలో మరో ముగ్గురికి వ్యాధి సంక్రమించినట్లు డీఎంహెచ్‌వో ఉమాసుందరి తెలిపారు. చిత్తూరులో 6, శ్రీకాకుళం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో మరో ఆరుగురికి కరోనా సోకింది. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. వైరస్‌ బారినపడిన ఓ ప్రైవేటు వైద్యుడి ఆస్పత్రిలో మెడికల్‌ స్టోర్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి(38), అతని భార్య(32), తండ్రి(60), ఏడు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు వ్యాధి సంక్రమించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లో ఇద్దరు అన్నదమ్ములకు కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణఅయింది. ముంబైలో ఉంటున్న వీరిద్దరూ బుధవారం ఉదయం స్వస్థలానికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలో మరో ఆరు కేసులు నమోదయ్యాయి. చెన్నై లింకులతో హనుమంతునిపాడు మండలంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-05-29T07:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising