ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయనవైపే సీఎం జగన్‌ మొగ్గు?

ABN, First Publish Date - 2020-12-10T08:08:28+05:30

కొద్ది రోజులుగా అధికార వర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తదుపరి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌!
  • ఈ నెలాఖరు వరకే నీలం సాహ్ని పదవీకాలం
  • అప్పటి వరకు సీఎస్‌ ఆఫీస్‌లో ఓఎస్డీగా దాస్‌!


 (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌ దాస్‌ నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. తదుపరి సీఎస్‌ ఎవరన్న అంశంపై కొద్ది రోజులుగా అధికార వర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రస్తుత సీఎస్‌ పదవీ కాలం ముగిసే తేదీన కొత్త సీఎస్‌ నియామక ఉత్తర్వులు వెలువడతాయి.


కానీ, ఈసారి భిన్నమైన ఒరవడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను సీఎస్‌ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు తెలిసింది. నెలాఖరు వరకూ ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఇలాంటి సంప్రదా యం కేంద్ర సర్వీసుల్లో ఉంటుంది. ఆ పంథాలోనే ఇక్కడ దాస్‌ నియామకం జరగబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, తర్వాతి స్థానంలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉన్నారు. వీరిలో అజయ్‌ సాహ్ని, సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్‌ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీభవన్‌లో పనిచేస్తున్నారు.


ఇక సతీష్‌చంద్ర.. చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసినందున  ఆయనను సీఎ్‌సగా చేయడానికి సీఎం సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. జేఎస్వీ ప్రసాద్‌పై కూడా సీఎంకు సదభిప్రాయం లేదు. తర్వాతి స్థానంలో ఉన్న నీరబ్‌ కుమార్‌ సీఎస్‌ అవుతారని, అందుకే ఆయనను సీసీఎల్‌ఏగా నియమించారని కొంతకాలంగా ప్రచారంలో ఉంది. అయితే, నీరబ్‌కు 2024 జూన్‌ వరకూ పదవీకాలం ఉంది. ఆయనను సీఎ్‌సగా నియమిస్తే మధ్యలో కొంతమందికి ఆ అవకాశం దూరమవుతుంది. సుదీర్ఘకాలం ఒకరినే సీఎ్‌సగా కొనసాగించడం సమంజసం కాదన్న ఉద్దేశంతో ఆదిత్యనాథ్‌ వైపే సీఎం మొగ్గుచూపారని చెబుతున్నారు. దాస్‌ జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. 

 

ఇవీ ఆయన వివరాలు..

ఆదిత్యనాథ్‌దాస్‌ జూన్‌ 1961లో బిహార్‌ లో పుట్టారు. తల్లిదండ్రులు డాక్టర్‌ గౌరీ కాంత్‌ దాస్‌, కుసుం కుమారి. 1987వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్‌ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌(1984-86) చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్‌, మునిసిపల్‌ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు. 


Updated Date - 2020-12-10T08:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising