ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ గ్యాంగ్‌ నన్నేమీ చేయలేదు

ABN, First Publish Date - 2020-10-04T08:25:50+05:30

‘జగన్‌, ఆయన గ్యాంగ్‌ నన్నేమీ పీకలేదు’ అని సబ్బంహరి తీవ్రంగా వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి డిబేట్‌లో సబ్బంహరి 


‘జగన్‌, ఆయన గ్యాంగ్‌ నన్నేమీ పీకలేదు’ అని సబ్బంహరి తీవ్రంగా వ్యాఖ్యానించారు. కూల్చివేతల సమయంలో ఇంటి వద్దా, సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ బిగ్‌ డిబేట్‌లోనూ ఆయన మాట్లాడారు.  ‘‘ముందుగా నోటీసు ఇస్తే నేనే తీయించేవాడిని. నోటీసు గోడకు అంటించామని జీవీఎంసీ సిబ్బంది చెబుతున్నారు. నోటీసు ఇస్తే తెల్లవారుజామున రావాల్సిన అవసరమేంటి?ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకే నాపై కక్ష కట్టారు. చిన్న విషయమైనప్పటికీ నా ఇంటిపైకి వచ్చారు. ఆ సమయంలో నేను సహనం కోల్పోయి ఏదైనా అంటే కేసు పెట్టొచ్చునని భావించారు.


కానీ, నా మానసిక సామర్థ్యం గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలియకపోయినా, సీఎం జగన్‌కు బాగా తెలుసు. విజయసాయిరెడ్డి విశాఖ వచ్చి ఏదో డ్యాన్స్‌ వేద్దామనుకుంటున్నారు. ఆయన ఆట కట్టించేస్తాను. ‘సబ్బం హరిని టచ్‌ చేసి, తప్పుచేశాను’ అనే స్థాయికి తెస్తాను. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చిన్న అవినీతికీ నేను పాల్పడలేదు. అధికారులే తమ తప్పు తెలుసుకుంటారు. నా స్థలంలో పాతిన పోల్స్‌ తొలగించి,తప్పుచేశామని లెంపలేసుకుంటారు’’ అని సబ్బంహరి ధీమా వ్యక్తంచేశారు.

Updated Date - 2020-10-04T08:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising