ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ABN, First Publish Date - 2020-08-15T22:20:09+05:30

అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలో కొన్నిచోట్ల భారీగా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురుస్తున్నాయి. ప్రధానంగా ఎగువన కురుస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలో కొన్నిచోట్ల భారీగా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురుస్తున్నాయి. ప్రధానంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. కోనసీమలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.  మన్యంలో శబరి, సీలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో ఓ మోస్తరు జల్లులు పడుతున్నాయి. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు పడుతున్నాయి. మరో వైపు గోదావరి నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. కృష్ణా నదికి ఇప్పటికే వచ్చిన వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

Updated Date - 2020-08-15T22:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising