ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టవర్ ఎక్కిన రైతు

ABN, First Publish Date - 2020-08-03T23:26:58+05:30

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేలపాడులోని రైతు పూర్ణ చంద్రరావు టవర్ దగ్గర క్రేన్‌పై ఎక్కి నిరసనకుదిగాడు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం తీసుకురావడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు సోదరుడు పులి చిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతి రాజధాని అవుతుందని ఓ ఎంపీ వెంట తిరిగి చాలా డబ్బులు ఖర్చుపెట్టి, భూములిచ్చి అప్పులపాలయ్యాడని..ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన రాగానే తన సోదరుడు మనస్తాపం చెంది క్రేన్ ఎక్కి నిరసనకు దిగాడన్నారు. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం జరగాలని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే టవర్ దిగుతానని, లేకుంటే కిందికి దూకుతానని స్పష్టం చేశాడు.

Updated Date - 2020-08-03T23:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising