ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా ఎప్పటికప్పుడు దాని జన్యుక్రమాన్ని మార్చుకుంటోంది’

ABN, First Publish Date - 2020-04-03T21:33:12+05:30

చైనాలోని వూహాన్‌లో పుట్టి.. ఒకరి తర్వాత మరొకరికి సోకుతూ.. ప్రపంచదేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్‌ ఏకంగా పది లక్షల మందికి పైగా సోకింది. ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చైనాలోని వూహాన్‌లో పుట్టి.. ఒకరి తర్వాత మరొకరికి సోకుతూ.. ప్రపంచదేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్‌ ఏకంగా పది లక్షల మందికి పైగా సోకింది. ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు పనిలోపడ్డారు. కరోనాకు అతిత్వరలో చెక్ పెట్టేందుకు వీరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను సీసీఎంబీ ఇప్పటికే ప్రారంభించింది. దీంతోపాటు ఆ వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొని, దానిలో వస్తున్న మార్పులను గుర్తించడానికి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు.


జన్యుక్రమం కనుగొనగాని దాని ఆధారంగా.. వైరస్‌పై ఏయే మందులు పనిచేస్తాయో తెలుసుకునే పనిలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ క్రమంలో ఆ సంస్థకు చెందిన మాజీ డైరెక్టర్‌ మోహన్‌రావు కరోనావైరస్‌పై ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చారు. కరోనా ఎప్పటికప్పుడు దాని జన్యుక్రమాన్ని మార్చుకుంటోందని, అందులో భాగంగానే జంతువుల నుంచి మనుషులకు వచ్చిందని ఆయన వెల్లడించారు. కరోనాకు టీకా, మందు కనుక్కోవడానికి టైమ్‌ పడుతుందని తెలిపారు. కరోనా మొదట ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, కిడ్నీ, గుండెపై ప్రభావం చూపుతుందని మోహన్‌రావు తెలిపారు.

Updated Date - 2020-04-03T21:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising