ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కానిస్టేబుల్ భార్య ఆత్మ హత్య

ABN, First Publish Date - 2020-06-01T17:20:09+05:30

విడతనకల్లులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: విడతనకల్లులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. విడతనకల్లు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సునీల్ కుమార్ భార్య విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాం ఆస్పత్రిలో ఉండగానే ఇరు కుటుంబసభ్యులు ఘర్షణకు దిగారు. పోలీసుల ఎదుటే దాడి చేసుకున్నారు. విజయలక్ష్మి మృ‌తికి భర్త సునీల్ కుమార్ కారణమని ఆమె బంధులు ఆరోపించారు. 


గుంతకల్‌కు చెందిన సునీల్ కుమార్, హాస్‌పేట్‌కు చెందిన విజయలక్ష్మికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడతనకల్లు పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత సునీల్ డ్యూటీకి వెళ్లాడు. అతను ఇంటినుంచి వెళ్లిన కొద్దిసేపటికి విజయలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సునీల్ తన భార్యకు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో వారు వెళ్లి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి సునీల్ కారణమని మృతిరాలు బంధువులు ఆరోపించారు. విజయలక్ష్మి తల్లి ఫిర్యాదుతో సునీల్ కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయలక్ష్మి ఆత్మహత్యకు గంట ముందు తనతో మాట్లాడిందని, అంతలోనే ఆత్మహత్యకు పాల్పడడం నమ్మసక్యంగా లేదని అన్నారు.

Updated Date - 2020-06-01T17:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising