తాడేపల్లిగూడెం బ్రేక్ ఇన్‌స్పెక్టర్ లంచావతారం
ABN, First Publish Date - 2020-11-07T02:14:20+05:30
లంచాల కోసమే ఉద్యోగం చేస్తున్నట్టుగా... ఓ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ నడిరోడ్డుపై కారు ఆపి పబ్లిక్‌గా లంచాలు డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. వాహనదారుల నుంచి ఎడాపెడా అక్రమంగా లంచాలు వసూళ్లు చేస్తూ కెమెరా కంటికి దొరికిన అతగాడి
ఏలూరు: లంచాల కోసమే ఉద్యోగం చేస్తున్నట్టుగా... ఓ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ నడిరోడ్డుపై కారు ఆపి పబ్లిక్‌గా లంచాలు డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. వాహనదారుల నుంచి ఎడాపెడా అక్రమంగా లంచాలు వసూళ్లు చేస్తూ కెమెరా కంటికి దొరికిన అతగాడి యవ్వారం ఏబీఎన్ చేతికి చిక్కింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎంవీఐ మృత్యుంజయరాజు లంచావతారం బట్టబయలైంది. జాతీయ రహదారిపై కారు ఆపి భారీగా మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఎవరైనా లంచాలు ఇవ్వకపోతే మాత్రం వారి దగ్గర ఉన్న రికార్డులు, సెల్‌ఫోన్లు తీసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. లంచం చేతికి అందిన తర్వాతే ఫోన్లు, రికార్డులు తిరిగి ఇస్తున్నాడు. ఇతర రాష్ట్రాల వాహనాలే లక్ష్యంగా మృత్యుంజయరాజు వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వసూళ్ల దందాకు సంబంధించిన వీడియో ఏబీఎన్ చేతికి చిక్కింది. లంచావతరం వ్యవహారం ఆర్టీఏ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో మృత్యుంజయరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - 2020-11-07T02:14:20+05:30 IST