ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-09-24T18:25:19+05:30

నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. విజయవాడలోని బీజేపీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు వరకు నేతలు విష్ణువర్ధన్ రెడ్డితోపాటు వంగవీటి నరేంద్ర, మరికొందరు ముఖ్య నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. సీఎం జగన్, మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు. 


దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన సీఎంకు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని బీజేపీ మహిళా కార్యకర్తలు అన్నారు. నిన్న తిరుమలలో మంత్రి చేసిన వ్యాఖ్యలతోపాటు ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మోదీ, యోగి వంటి నాయకుల చరిత్ర తెలుసుకోకుండా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై సీఎం ప్రమేయం ఉందని బీజేపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


సీఎం జగన్ స్పందించకుండా, నానిని బర్త్ రఫ్ చేయకుండా ఉంటే మాత్రం.. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే కొడాలి నాని ఆ విధంగా వ్యాఖ్యలు చేసినట్లు భావించవలసి వస్తుందని బీజేపీ నేతలు అన్నారు. బీజేపీ మతతత్వ పార్టీగా విమర్శించడాన్ని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Updated Date - 2020-09-24T18:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising