ఆర్‌అండ్‌బీలో టెండర్ విన్యాసాలు
ABN, First Publish Date - 2020-09-14T09:12:41+05:30
టెండర్ నిబంధనలను అవసరాలకు అనుగుణంగా ఆర్‌అండ్‌బీ మార్చేస్తోంది. రూ.6400 కోట్ల విలువైన న్యూ డెవల్‌పమెంట్ బ్యాంకు(ఎన్‌డీ బీ) పనుల్లో హార్డ్ కాపీల సమర్పణకు ఒక
కదిరి బైపాస్ పనికి మారిన నిబంధన
ఎల్‌వోఏ ఖరారయ్యాకే హార్డ్ కాపీలివ్వాలని ఆదేశం
ఇదే రూల్ ఎన్‌డీబీకీ వర్తింపజేయాలన్న సంస్థలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
టెండర్ నిబంధనలను అవసరాలకు అనుగుణంగా ఆర్‌అండ్‌బీ మార్చేస్తోంది. రూ.6400 కోట్ల విలువైన న్యూ డెవల్‌పమెంట్ బ్యాంకు(ఎన్‌డీ బీ) పనుల్లో హార్డ్ కాపీల సమర్పణకు ఒక నిబంధ న చూపిస్తూ.. ఇప్పుడు హైవే టెండర్‌లో మరో నిబంధన తీసుకొచ్చింది. నేషనల్ హైవే-42లో భాగంగా రూ.123 కోట్ల వ్యయంతో తలపెట్టిన కదిరి బైపాస్ టెండర్‌లలోనూ బెదిరింపులు, రాజీ ఫా ర్ములాలు వచ్చాయి. టెండర్ నుంచి తప్పుకోవాలని ఓ కాంట్రాక్టర్ పై పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చారు. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శా ఖ(ఎంవోఆర్‌టీహెచ్)కు, జాతీయరహదారుల(ఎన్‌హెచ్‌ఏఐ) సం స్థకి ఫిర్యాదులు వెళ్లాయి.
ఈ నేపఽథ్యంలో ఆర్‌అండ్‌బీ ఈ టెండర్ పై పునరాలోచనలో పడింది. బిడ్ల దాఖలు తేదీని ఈ నెల 14 నుంచి 21 వరకు పొడిగించింది. టెండర్ డాక్యుమెంటులోనూ కీల క సవరణ చేసింది. బిడ్‌సెక్యూరిటీ విధానంలో ఎంవోఆర్‌టీహెచ్, ఎన్‌హెచ్‌ఏఐ అమలు చేస్తున్న కీలక నిబంధనను కదిరి బైపాస్ పనిలో అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రైస్‌బిడ్ తెరిచాక ఎల్-1కు అంగీకార లేఖ(ఎల్‌వోఏ) ఇచ్చే సమయంలోనే ఒరిజిన ల్ డాక్యుమెంట్లు(హార్డ్ కాపీ) సమర్పించాలని సవరణ(కోరిజెండ మ్) ఉత్తర్వులు ఇచ్చింది.
అంటే టెక్నికల్ బిడ్లు ముగిసిన వెంటనే ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలన్న నిబంధనను తొలగించారన్న మాట. మరి ఇదే నిబంధనను రూ.6,400 కోట్ల విలువైన ఎన్‌డీబీ పనులకు ఎందుకు వర్తింపజేయరని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. త్వరలో మరో 9 జిల్లాల రోడ్ల పనులకు సంబంధించి టెండర్లు పిలవనున్నారు. దీంతో ఎన్‌డీబీ పనులన్నిటికీ ఇదే విధా నం వర్తింపజేయాలని కాంట్రాక్టు సంస్థలు కోరుతున్నాయి.
Updated Date - 2020-09-14T09:12:41+05:30 IST